YS Sharmila: హైదరాబాదులో ముస్లిం మత పెద్దలతో వైఎస్ షర్మిల సమావేశం

YS Sharmila met muslim priests

  • తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ
  • హైదరాబాదు పాతబస్తీలో పర్యటించిన షర్మిల
  • తలాబ్ కట్టలో పలువురు ముస్లిం మతపెద్దలను కలిసిన వైనం
  • ఆపై బతుకమ్మ వేడుకలకు హాజరు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట రాజకీయ పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిల అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ముస్లిం మతపెద్దలతో సమావేశం అయ్యారు. షర్మిల నేడు హైదరాబాద్ పాతబస్తీలోని తలాబ్ కట్టకు వెళ్లారు.

దేశంలోనే అతిపెద్ద ముస్లిం మతపెద్దల సంస్థ అయిన జమియతే ఉలేమాయే హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఫ్తీ ఘయాస్ రహ్మానీ, ప్రధాన కార్యదర్శి ముఫ్తీ జుబేర్ ఖాస్మిలను కలిశారు. ఈ మర్యాద పూర్వక సమావేశంలో అన్ని జిల్లాల మతపెద్దలు కూడా పాల్గొన్నారు. కాగా, షర్మిల సద్దుల బతుకమ్మ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

YS Sharmila
Muslim
Priests
Hyderabad
YSR Telangana Party
Telangana
  • Loading...

More Telugu News