Qualifier-2: ఐపీఎల్ క్వాలిఫయర్-2: ఢిల్లీపై టాస్ నెగ్గిన కోల్ కతా

KKR won the toss in crucial IPL Qualifier two

  • షార్జాలో కీలక సమరం
  • ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
  • బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • ఢిల్లీ జట్టులో స్టొయినిస్ కు స్థానం

ఐపీఎల్ లో నేడు సెమీఫైనల్ అనదగ్గ క్వాలిఫయర్-2 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. షార్జాలో జరిగే ఈ కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఈ నెల 15న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కోల్ కతా సారథి ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు. షార్జా మైదానం తమకు కలిసొస్తుందని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇక ఢిల్లీ జట్టులో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ కు స్థానం కల్పించారు. టామ్ కరన్ ను జట్టు నుంచి తప్పించినట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. టాస్ గురించి తాము పెద్దగా ఆలోచించడంలేదని స్పష్టం చేశాడు.

Qualifier-2
KKR
Toss
Delhi Capitals
IPL
  • Loading...

More Telugu News