Jaish-e-Mohammad: జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ ను కాల్చి చంపిన భారత సైన్యం

Indian army killed Jaish top commander Sham Sofi
  • అవంతిపొరా సెక్టార్ లో ఎన్ కౌంటర్
  • టాప్ కమాండర్ షమ్ సోఫీని మట్టుబెట్టిన సంయుక్త బలగాలు
  • ఇటీవలి కాలంలో 10 మంది ఉగ్రవాదులను చంపిన సైన్యం
జమ్మూకశ్మీర్ లో భారత బలగాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ కు చెందిన టాప్ కమాండర్ షమ్ సోఫీని బలగాలు కాల్చి చంపాయి. ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. అవంతిపొరా సెక్టార్ లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో షమ్ సోఫీని సంయుక్త బలగాలు హతమార్చాయని చెప్పారు.

ఇటీవలే ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు సరిహద్దులను దాటి భారత్ లో అడుగుపెట్టారు. ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో, సైన్యం ఉగ్రమూకను ఏరివేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది ఉగ్రవాదులను చంపేసింది.
Jaish-e-Mohammad
Encounter
Top Commander
Sham Sofi
Terrorist

More Telugu News