Sensex: సరికొత్త రికార్డులను నమోదు చేసిన మార్కెట్లు.. దూసుకుపోయిన సెన్సెక్స్

Markets touches new records

  • 452 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 170 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5.17 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. రీటెయిల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠ స్థాయికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు లాభపడి 60,737కి చేరుకుంది. నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 18,161 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.41%), ఐటీసీ (3.34%), ఎల్ అండ్ టీ (2.34%), టెక్ మహీంద్రా (2.09%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.05%), నెస్లే ఇండియా (-0.64%), యాక్సిస్ బ్యాంక్ (-0.35%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.31%).

  • Loading...

More Telugu News