North Korea: అమెరికాను మరోమారు తీవ్రంగా హెచ్చరించిన కిమ్ 

Kim Jong Un warns america once again

  • అమెరికా సహా శత్రుదేశాలను ఎదుర్కోవడమెలాగో మాకు తెలుసు
  • అజేయ సైన్యాన్ని నిర్మిస్తాం
  • అమెరికా మాటలు నమ్మడానికి లేదు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికాపై మరోమారు నిప్పులు చెరిగారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని ఆరోపించారు. యూఎస్ సహా శత్రుదేశాలను ఎదుర్కోవడమెలానో తమకు తెలుసని అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు అజేయ సైన్యాన్ని నిర్మిస్తామన్నారు.

ఉత్తరకొరియాపై దాడిచేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా చెబుతున్నా, దాని మాటలు విశ్వసించడానికి లేదన్నారు. తమను తాము కాపాడుకునేందుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉంటామని స్పష్టం చేశారు.

కాగా, అంతర్జాతీయ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉంది. 2018లో అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-కిమ్ మధ్య జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిశాయి. ఈ నేపథ్యంలో కిమ్‌తో చర్చలకు సిద్దమని తాజా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానిస్తున్నా కిమ్ మాత్రం పెదవి విప్పడం లేదు.

North Korea
Kim Jong Un
Joe Biden
Donald Trump
  • Loading...

More Telugu News