Krish: 'కొండ పొలం' నుంచి నేను నేర్చుకున్నది అదే: క్రిష్

Konda Polam movie update

  • క్రిష్ నుంచి వచ్చిన 'కొండ పొలం'
  • గొర్రెలు కాయడం అంత తేలికైన పనికాదు
  • వాళ్ల పరిశీలన శక్తి ఎక్కువ
  • ఎవరికీ వాళ్లు తక్కువ కాదు

క్రిష్ దర్శకత్వంలో ఇటీవల 'కొండ పొలం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్ తేజ్ - రకుల్ జంటగా రూపొందిన ఈ సినిమా, కథాకథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కీరవాణి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విషయంలో తనకి ఎదురైన అనుభవాలను గురించి క్రిష్ స్పందించారు.  

"ఈ సినిమాలో హీరో గొర్రెలకాపరి. అందువలన నేను గొర్రెల కాపరుల జీవితాలను దగ్గరగా పరిశీలించాను. బయటవారు గొర్రెలు కాయడంలో గొప్పతనం ఏముందని అనుకుంటారు. కానీ గొర్రెలు కాయడానికి చాలా ఓర్పు .. నేర్పు అవసరం. వాటిని అదిలించడం .. ఒకదారిలో నడిపించడం కష్టం.

మందగా ఉన్న గొర్రెలను పరిశీలించడం అంత తేలికైన పనేం కాదు. గొర్రెలు ఈతకు వచ్చిన సంగతి .. అవి ఏ కారణంగా ఇబ్బందులు పడుతున్నాయనేది గొర్రెల కాపరులు వెంటనే పసిగడతారు. నా దృష్టిలో వాళ్లు ఎవరికీ తక్కువకాదు. వాళ్లకి గల అవగాహన .. అనుభవం చూశాకే నేను ఈ మాట చెబుతున్నాను" అన్నారు.

Krish
Panja Vaisshnav Tej
Rakul Preet Singh
  • Loading...

More Telugu News