shiva balaji: శివ బాలాజీ చేతిని కొరికిన న‌టి హేమ.. వీడియో వైర‌ల్‌.. ఎందుకు కొరికానో చెప్పిన‌ హేమ‌

MAA Elections 2021

  • శివబాలాజీ చేతిని అడ్డుగా పెట్టాడు
  • అందుకే కొరికానన్న హేమ‌
  • ఆయ‌నను తప్పుకోవాల‌ని చెబితే విన‌లేదని వ్యాఖ్య‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ సంద‌ర్భంగా శివ బాలాజీ, హేమ మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శివ‌బాలాజీ చేతిని హేమ కొరికింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. శివ‌బాలాజీ చేతిని హేమ కొరికింద‌ని న‌రేశ్ కూడా మీడియాకు తెలుపుతూ ఆ గాయాన్ని చూపించారు. దీంతో దీనిపై హేమ వివ‌ర‌ణ ఇచ్చింది.

పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌ తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేతిని అడ్డుగా పెట్టాడని ఆమె చెప్పారు. ఆయ‌నను తప్పుకోవాల‌ని కోరాన‌ని, అందుకు ఆయ‌న ఒప్పుకోలేద‌ని  వివ‌రించారు. అందుకే తాను అత‌డి చేతిని కొరకాల్సి వచ్చిందని అన్నారు. అంతేగానీ, దీని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. ఈ వివాదంపై శివ‌బాలాజీ కూడా స్పందించారు. త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేద‌ని, ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయాల‌ని ఆమె చెప్పారు.
                 

shiva balaji
  • Error fetching data: Network response was not ok

More Telugu News