Sharwanand: అజయ్ భూపతి అందరినీ కంగారు పెట్టేశాడు: సిద్ధార్థ్

Maha Samidram movie update

  • షూటింగులో గాయపడ్డాను
  • ట్రీట్మెంట్ కోసమే హాస్పిటల్ కి వెళ్లాను
  • సర్జరీ ఏమీ జరగలేదు
  • అందరికీ ఆన్సర్ చేయలేక హైరానా పడ్డాను  

సిద్ధార్థ్ కి తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. 'బొమ్మరిల్లు' .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?' వంటి హిట్లు ఆయనను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంచాయి. కొంత గ్యాప్ తరువాత ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా చేశాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగులో నేను గాయపడ్డాను. అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు సర్జరీ అయిందని అజయ్ భూపతి చెప్పాడట.

నాకు సర్జరీ అనే సరికి నా అభిమానులతో పాటు .. మా బంధువులు కూడా కంగారు పడిపోయారు. అందరూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. వాళ్లందరికీ అసలు సంగతి చెబుతూ రావలసి వచ్చింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను .. కానీ అజయ్ భూపతి అందరినీ కంగారు పెట్టేశాడు" అంటూ నవ్వేశాడు.

Sharwanand
Siddharth
Anu Emmanuel
  • Loading...

More Telugu News