Samantha: నాకు అఫైర్లు ఉన్నాయట... నేను అవకాశవాదినట!: రూమర్లపై సమంత ఆవేదన

Samantha gets emotional

  • నాగచైతన్యతో విడిపోయిన సమంత
  • ఇటీవలే ఇరువురి ప్రకటన
  • కారణాలు ఏంటంటూ విపరీతస్థాయిలో ప్రచారం
  • దుష్ప్రచారాన్ని ఖండించిన సామ్

నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత వస్తున్న కథనాలు, జరుగుతున్న ప్రచారంపై సమంత నేడు తీవ్రస్థాయిలో స్పందించారు. తనకు అఫైర్లు ఉన్నాయని, సంతానం వద్దనుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేనొక అవకాశవాదినంటున్నారు. ఇప్పుడు అబార్షన్లు కూడా చేయించుకున్నానట. విడాకులు అనేది ఎంతో బాధాకరమైన అంశం. కాలమే దీన్ని నయం చేస్తుంది. అందుకే నా మానాన నన్ను వదిలేయండి. గత కొన్నిరోజులుగా నాపై జరుగుతున్న ఈ వ్యక్తిగత విమర్శల దాడులు చూస్తుంటే ఏమాత్రం కనికరం లేకుండా ఉన్నారనిపిస్తోంది.

కానీ ఇలాంటి విమర్శలతో నన్ను కుంగదీయాలనుకుంటే ఎప్పటికీ తలవంచేది లేదు. ఈ వ్యక్తిగత సంక్షోభ సమయంలో అభిమానులు నాపై చూపుతున్న భావోద్వేగభరిత స్పందనలు నన్ను ముంచెత్తుతున్నాయి. హృదయపూర్వకంగా సహానుభూతి ప్రదర్శిస్తూ, నాపై వస్తున్న పుకార్లను, తప్పుడు కథనాలను ఖండిస్తూ నాకు మద్దతిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ సమంత వివరణ ఇచ్చారు.

Samantha
Nagachaitanya
Divorce
Tollywood
  • Loading...

More Telugu News