Deepak Chahar: గాళ్ ఫ్రెండ్ కు స్టేడియంలో ప్రపోజ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్

Deepak Chahar proposes his girl friend in stadium

  • దుబాయ్ లో చెన్నై, పంజాబ్ మ్యాచ్
  • మ్యాచ్ సందర్భంగా మధుర క్షణాలు
  • ఉంగరాలు మార్చుకున్న దీపక్ చహర్, ప్రియురాలు
  • సోషల్ మీడియాలో వీడియో సందడి

దుబాయ్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కొన్ని అద్భుత క్షణాలకు వేదికగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ తన ప్రేయసికి ప్రపోజ్ చేయగా, ఆమె తన అంగీకారం తెలిపింది. ఇరువురు ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమను పండించుకునే దిశగా ముందడుగు వేశారు. కాగా, చహర్ ప్రేయసి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చహర్ ప్రపోజల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్ లో పంచుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News