KL Rahul: కేఎల్ రాహుల్ విధ్వంసక ఇన్నింగ్స్... పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

KL Rahul heroics handed Punjab much needed win

  • చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ
  • చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపు
  • 42 బంతుల్లో 98 పరుగులు చేసిన రాహుల్
  • 7 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడిన వైనం

ఐపీఎల్ లో మరో అద్భుత ఇన్నింగ్స్ ఆవిష్కృతమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో దుబాయ్ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్... రాహుల్ విధ్వంసక ఇన్నింగ్స్ తో మరో 7 ఓవర్లు మిగిలుండగానే జయభేరి మోగించింది. ఈ క్రమంలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది.

రాహుల్ 42 బంతుల్లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్ తన జట్టుకు ఎంతో అవసరమైన గెలుపును అందించాడు. రాహుల్ స్కోరులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

మయాంక్ అగర్వాల్ 12, ఐడెన్ మార్ క్రమ్ 13 పరుగులు చేశారు. సర్ఫరాజ్ ఖాన్ (0), షారుఖ్ ఖాన్ (8) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు.

కాగా, ఈ విజయంలో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ జట్లు ఆడే మ్యాచ్ ల జయాపజయాలపై పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తు ఆధారపడి ఉంది.

KL Rahul
Punjab Kings
Chennai Super Kings
Play Offs
IPL
  • Loading...

More Telugu News