Pawan Kalyan: ఈ నెల 9న జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం

Pawan Kalyan will meet Janasena Telangana wing active members

  • తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్యలు
  • క్రియాశీలక సభ్యులతో చర్చించేందుకు నిర్ణయం
  • సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ
  • హైదరాబాద్ అజీజ్ నగర్ లో సమావేశం

తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ నెల 9న హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ కీలక సమావేశానికి హైదరాబాద్ అజీజ్ నగర్లోని జేపీఎల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలవనుంది. తెలంగాణలో జనసేన కార్యకలాపాలు విస్తృతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజల పక్షాన నిలిచి పోరాడడంపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారు.

  • Loading...

More Telugu News