TTD: కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ.. పూర్తి వివరాలు ఇవిగో!

TTD executive committee resolutions

  • అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ. 7.5 కోట్లు
  • జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 17.40 కోట్లు
  • టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్ కు ఆమోదం  

ఈరోజు జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ. 7.5 కోట్లు మంజూరు చేశారు. కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ. 2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. అలాగే, జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదించారు.

టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ. 4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ. 2.61 కోట్లు మంజూరు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News