Astrazeneca: అంటార్కిటికా మంచు ఖండానికి చేరిన ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్

Astrazeneca corona vaccine reached Antarctica

  • అంటార్కిటికాలో బ్రిటన్ పరిశోధనలు
  • రోథెరా పరిశోధన కేంద్రం ఏర్పాటు
  • విధుల్లో 23 మంది పరిశోధకులు, సిబ్బంది
  • తొలి డోసు వ్యాక్సిన్ అందజేత

కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడించడం మొదలుపెట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. వ్యాక్సిన్లు రాకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ప్రపంచదేశాలకు ఊరట కలిగిస్తున్న ఈ కరోనా వ్యాక్సిన్లలో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కూడా ఉంది. బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ గత 9 నెలలుగా వినియోగంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన ఇన్నాళ్లకు ఈ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ అంటార్కిటికా మంచుఖండానికి చేరింది. అంటార్కిటికాలో బ్రిటన్ కు చెందిన రోథెరా పరిశోధన కేంద్రం ఉంది. ధృవప్రాంతాల్లో శీతాకాలం పొడవునా ఈ పరిశోధన కేంద్రం కార్యకలాపాలు సాగిస్తుంది. ఇక్కడ పనిచేసే 23 మంది పరిశోధకులు, ఇతర సిబ్బందికి బ్రిటన్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లు పంపించింది.

అంటార్కిటికాలో అనేక దేశాలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ చిలీకి చెందిన బృందంలో కొన్ని కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతకుతప్పించి మరే దేశపు పరిశోధన కేంద్రంలోనూ కరోనా వ్యాప్తి లేదు. ఈ నేపథ్యంలో, బ్రిజ్ నోర్టన్ నుంచి బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) వోయేజర్ విమానం 10 వేల మైళ్లు ప్రయాణించి రోథెరా పరిశోధకుల కోసం కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది.

డోసులు చేరుకున్న వెంటనే అక్కడి పరిశోధకులు, ఇంజినీర్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బందికి వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ చేశారు. ఇది తొలి డోసు. మరో నాలుగు వారాల వ్యవధిలో వీరికి రెండో డోసు ఇస్తారు.

Astrazeneca
Corona Virus
Vaccine
Antarctica
Rothera Research Station
UK
  • Loading...

More Telugu News