Uttarakhand: చార్‌ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Uttarkhand Govt issues new SOP for Char Dham Yatra

  • యాత్రికుల సంఖ్యలో పరిమితుల ఎత్తివేత 
  • దర్శనం కోసం చార్‌ధామ్ బోర్డు పోర్టల్‌లో వివరాల నమోదు తప్పనిసరి
  • వ్యాక్సినేషన్ పూర్తయినట్టు ధ్రువీకరణ పత్రం ఉండాల్సిందే

చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితిని ఎత్తివేయాలని, అది సాధ్యం కాకుంటే మరింత మందిని అనుమతించాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం బద్రీనాథ్‌కు రోజుకు 1000 మంది, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇప్పటికే ప్రారంభమైన యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, కాబట్టి భక్తుల సంఖ్యపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం అభ్యర్థించింది.

స్పందించిన కోర్టు మంగళవారం పరిమితులను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిన్న చార్‌ధామ్ యాత్రకు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. యాత్రికుల సంఖ్య విషయంలో వున్న పరిమితులను ఎత్తివేసింది. దర్శనం కోసం తప్పనిసరిగా చార్‌ధామ్ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.

పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఇకపై పోర్టల్ నుంచి యాత్ర ఈ-పాస్ అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు ధ్రువపత్రం కానీ, లేదంటే యాత్రకు ముందు చేయించుకున్న కొవిడ్ పరీక్ష నెగటివ్ రిపోర్టు కానీ యాత్రికులు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

Uttarakhand
Char Dham Yatra
SOP
E-Pass
Devotees
  • Loading...

More Telugu News