Rajiv Kanakala: మంచు విష్ణుకు బాలయ్య మద్దతు ఉంది.. ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ కూడా విష్ణుకే మద్దతు ఇవ్వొచ్చు: రాజీవ్ కనకాల

Rajiv Kanakala supports Manchu Vishnu panel

  • నా మద్దతు మంచు విష్ణు ప్యానల్ కే
  • అసోసియేషన్ బిల్డింగ్, సభ్యుల సంక్షేమంపై విష్ణు పూర్తి స్పష్టతతో ఉన్నారు
  • వేరే వాళ్లు మన ఇంట్లో పెద్దరికం తీసుకుంటామంటే ఒప్పుకుంటామా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ కే తాను మద్దతు పలుకుతానని రాజీవ్ కనకాల చెప్పారు. అసోసియేషన్ బిల్డింగ్, సభ్యుల సంక్షేమంపై విష్ణు పూర్తి స్పష్టతతో ఉన్నారని అన్నారు. విష్ణుకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పటికే బాలకృష్ణ చెప్పారని... రానున్న రోజుల్లో ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ కూడా విష్ణుకే మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు. ఇతర నటీనటులు కూడా ఆయనకే మద్దతు ఇవ్వొచ్చని అన్నారు. వేరే వాళ్లు మన ఇంట్లో పెద్దరికం తీసుకుంటామంటే ఒప్పుకుంటామా? అని ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

గత ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ నుంచి పోటీ చేసి తాను కోశాధికారి పదవిని పొందానని చెప్పారు. ఆ ప్యానల్ నుంచి తాను ఒక్కడినే గెలిచానని... అయినా నరేశ్ టీమ్ తో కలిసి ఎంతో చేశానని అన్నారు. అవకాశాలు లేని ఆర్టిస్టుల కోసం ఎంతో చేశామని... 40 మందికి అవకాశాలు వచ్చేలా చేశామని తెలిపారు. కానీ, ఇప్పుడు పోటీ పడుతున్న వాళ్లు మాత్రం తమ గురించి ఎన్నో కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాను విష్ణు ప్యానల్ కి మద్దతిస్తున్నానని చెప్పారు.

Rajiv Kanakala
Manchu Vishnu
Prabhas
Mahesh Babu
Junior NTR
Tollywood
MAA
  • Loading...

More Telugu News