RCB: ఐపీఎల్ 2021: హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు

Kohli team won the toss and elect to bowl first

  • బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన
  • గెలిచి పరువు నిలుపుకోవాలని హైదరాబాద్ ఆరాటం
  • మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్న రెండు జట్లు

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు, హైదరాబాద్ జట్లు రెండూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న కోహ్లీ సేన ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరుకోగా, పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

బెంగళూరు గెలిస్తే పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటుంది. అలాగే, పాయింట్ల పట్టికలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 18 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో, 16 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగో స్థానం కోసం కోల్‌కతా, ముంబై జట్లు పోటీపడుతున్నాయి.

RCB
SRH
IPL 2021
Virat Kohli
Kane Williamson
  • Loading...

More Telugu News