Bengaluru: క్యాబ్ డ్రైవర్‌పై చిందులేసిన సినీ నటి సంజన.. వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్

Kannada Actress Sanjana Galrani fires on Ola Cab driber

  • షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్న నటి
  • లొకేషన్ మార్చాలంటూ గొడవ
  • పోలీసులకు డ్రైవర్ ఫిర్యాదు
  • డ్రైవరే తమను వేధించాడంటూ ట్వీట్

డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకెళ్లి ఇటీవల విడుదలైన కన్నడ నటి సంజన గల్రాని తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్‌పై విరుచుకుపడింది. కోపంతో ఊగిపోతూ దుర్భాషలాడింది. నిన్న ఉదయం షూటింగ్‌కు కోసం బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి రాజరాజేశ్వరినగర్ వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది.

అయితే, కారు ఎక్కిన తర్వాత తన లొకేషన్‌ను మార్చాలని డ్రైవర్‌ను సంజన కోరింది. డ్రైవర్ సుసే మణి లొకేషన్ మార్చకుండా కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కనుక్కున్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సంజన డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ అతడితో గొడవకు దిగింది. దీంతో అతడు ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సంజనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు, సంజన కూడా ట్విట్టర్‌లో గొడవకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేసింది. క్యాబ్ డ్రైవర్‌పై పలు ఆరోపణలు చేసింది. కారులో తాము నలుగురం ఉన్నామని, ఏసీ పెంచమన్నా పెంచలేదని పేర్కొంది. డ్రైవర్ మణి తమకు నిర్లక్ష్యంగా బదులిచ్చాడని, కారు డోర్ సరిగా లేదని ఆరోపించింది. ఈ ఘటనపై ఓలా కస్టమర్ సర్వీసుకు ఫిర్యాదు చేసింది. అలాగే, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News