Andhra Pradesh: ఒంగోలులో ఎల్లుండి ఆసరా రెండోవిడత రుణమాఫీని ప్రారంభించనున్న జగన్

AP CM YS Jagan visits ongole on 7th oct
  • రూ.6,400 కోట్ల నగదు పంపిణీ
  • రెండేళ్ల తర్వాత ఒంగోలుకు జగన్
  • కార్యక్రమ వేదిక, హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రి బాలినేని తదితరులు
ఈ నెల ఏడో తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసరా కింద మహిళలకు రూ. 6,400 కోట్ల నగదు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల తర్వాత ఒంగోలు వస్తున్నట్టు చెప్పారు. పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

ఒంగోలులో సీఎం పాల్గొనే కార్యక్రమ వేదిక, హెలీప్యాడ్ స్థలాలను బాలినేని, సీఎం పర్యటన కార్యక్రమాల పర్యవేక్షకులు టి.రఘురాం, సీఎం సెక్యూరిటీ అధికారి వకుల్ జిందాల్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికా గర్గ్ పరిశీలించారు.
Andhra Pradesh
Jagan
Prakasam District
Ongole

More Telugu News