Munmun: డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడికి బెయిలు తిరస్కరణ
- క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడి
- ఆర్యన్ సహా 8 మందిని అదుపులోకి తీసుకొని విచారణ
- గురువారం వరకూ ఎన్సీబీ కస్టడీలోనే ఉండాలని ముంబై కోర్టు తీర్పు
ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్‌లో నార్కొటిక్స్ బ్యూరో చేసిన దాడిలో పట్టుబడిన స్టార్ కిడ్ ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరకలేదు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఆర్యన్‌తోపాటు అర్బాజ్ దమేచాలను కూడా ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పిచ్చింది.
కోర్టులో ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది సతీశ్ మనేషిండే వాదనలు వినిపించారు. ఇతరుల దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్‌కు సంబంధం లేదని సతీశ్ వాదించారు. అయితే అన్ని ఆధారాలూ ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకున్నామని ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. ఆర్యన్, అతని మిత్రుల నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టాలంటే తమకు మరింత సమయం కావాలని కోరింది.
ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆర్యన్‌తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాల బెయిలు పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నెల 7వ తేదీ వరకూ వారిని ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది