Jeevitha: ఓటు అడిగితే జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడో చెప్పిన జీవిత

Jeevitha tells what Jr NTR said

  • మరి కొన్నిరోజుల్లో మా ఎలక్షన్స్
  • మీడియా సమావేశం నిర్వహించిన జీవిత
  • ఆసక్తికర అంశం వెల్లడి
  • ఎన్టీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు వివరణ

మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నటి జీవిత ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇటీవల ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశానని వెల్లడించారు. మా ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి, మీ ఓటు నాకే వేయాలి అని కోరానని తెలిపారు. అప్పుడు ఎన్టీఆర్ ఏంచెప్పారో జీవిత వివరించారు.

తాజా పరిణామాలు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తనను ఓటు అడగొద్దని అన్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని జీవిత అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.

Jeevitha
Jr NTR
Vote
MAA Elections
Tollywood
  • Loading...

More Telugu News