Sensex: నాలుగు రోజుల నష్టాలకు ముగింపు పలికి, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 534 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 159 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ ఎన్టీపీసీ షేర్

దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు పాజిటివ్ గా ఉంటాయనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 534 పాయింట్లు లాభపడి 59,299కి చేరుకుంది. నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుని 17,691కి ఎగబాకింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.08%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.50%), బజాజ్ ఫైనాన్స్ (2.29%), టెక్ మహీంద్రా (2.04%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-0.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.46%), టైటాన్ కంపెనీ (-0.42%), నెస్లే ఇండియా (-0.32%), కొటక్ మహీంద్రా (-0.24%).

  • Loading...

More Telugu News