West Bengal: ఉపఎన్నిక తర్వాత హింస జరగకుండా చూడండి: బెంగాల్ ప్రభుత్వానికి ఈసీ సూచన

EC asks West Bengal govt to ensure no violence after bypoll results

  • భవానీపూర్‌లో ఘనవిజయం సాధించిన తృణమూల్
  • మమతకు బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58 వేల ఓట్లపైగా ఆధిక్యం
  • ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఈసీ ఆందోళన

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. భవానీపూర్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కోరింది. గత ఎన్నికల్లో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) భారీ విజయం తర్వాత పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ అధినేత్రి ఘనవిజయం తర్వాత అలాంటి పరిస్థితులే తలెత్తే ప్రమాదముందని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. కాగా, భవానీ పూర్‌ ఉప ఎన్నికలో సీఎం మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత ప్రియాంకపై 58 వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

  • Loading...

More Telugu News