Mamata Banerjee: ఉప ఎన్నిక‌లో ఆధిక్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ

mamata leads in bhabanipur

  • గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా ఓడిన‌ మమతా బెనర్జీ
  • సీఎంగా ఆమె కొన‌సాగాలంటే ఎమ్మెల్యేగా గెల‌వడం త‌ప్ప‌నిస‌రి
  • భవానీపూర్‌ అసెంబ్లీ  ఉప ఎన్నికలో పోటీ
  • ఆమె క‌న్నా బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ 2,800 ఓట్లు వెనుకంజ

కొన్ని నెల‌ల క్రితం పశ్చిమ బెంగాల్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. సీఎంగా ఆమె కొన‌సాగాలంటే ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో భవానీపూర్‌ అసెంబ్లీ  ఉప ఎన్నికలో మ‌మ‌తా బెన‌ర్జీ  పోటీ చేశారు.

ఈ రోజు జ‌రుగుతోన్న ఓట్ల లెక్కింపులో ఆమె ముందంజ‌లో ఉన్నారు. ఆమె క‌న్నా బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ 2,800 ఓట్లు వెన‌క‌బ‌డి ఉన్నారు. మ‌రోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని మిగ‌తా రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. సీఎం ప‌ద‌విని కాపాడుకోవడానికి భవానీపూర్‌ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ విజయం సాధించడం  తప్పనిసరి కావ‌డంతో ఈ ఎన్నిక‌ను ఆమె ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు.

  • Loading...

More Telugu News