IPL 2020: కెప్టెన్‌గా రాణిస్తున్నాడు.. కానీ..: మోర్గాన్‌పై కోచ్ కామెంట్స్
- 11 మ్యాచుల్లో కేవలం 109 పరుగులే చేసిన మోర్గాన్
- పంజాబ్‌పై పరాజయం తర్వాత మీడియాతో మాట్లాడిన కోచ్ మెకల్లమ్
- 9 బంతుల్లో 22 పరుగులు చేసి గెలిచిన పంజాబ్
గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌లో ఓడిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అదే. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ అలాగే ఓడింది. చివరి 9 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా అందరూ కేకేఆర్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పంజాబ్ గెలిచింది.
ఈ క్రమంలో కేకేఆర్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించారు. జట్టు సారధిగా ఇయాన్ మోర్గాన్ అద్భుతంగా రాణిస్తున్నాడని, కానీ అతను బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇప్పటి వరకూ జట్టును అతను చాలా గొప్పగా ముందుకు నడిపించాడని మెకల్లమ్ మెచ్చుకున్నాడు. కానీ జట్టులోని అంతర్జాతీయ క్రీడాకారుల్లో ఒకరైనప్పుడు కచ్చితంగా బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
మోర్గాన్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని, జట్టుకు కీలకమైన విజయాలు అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటి వరకూ ఐపీఎల్ 2021లో 11 మ్యాచులు ఆడిన మోర్గాన్ కేవలం 109 పరుగులు మాత్రమే చేసి వరస్ట్ పెర్ఫార్మర్లలో ఒకడిగా ఉన్నాడు.