అవును... మేం విడిపోతున్నాం: సమంత
- వైవాహిక బంధానికి ముగింపు పలికిన నాగచైతన్య, సమంత
- ఇద్దరూ ఒకే ప్రకటనను పంచుకున్న వైనం
- ఇక ఎవరి దారులు వారివేనంటూ ప్రకటన
- తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న సమంత
"అవును... మేం విడిపోతున్నాం. మా దారుల్లో మేం పయనించాలని నిర్ణయించుకున్నాం. ఇది ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మా దారులు వేరైనా మా మధ్య ఎప్పటికీ ప్రత్యేకమైన బంధం ఉంటుందని నమ్ముతున్నాం. అభిమానులు, సన్నిహితులు, పాత్రికేయులు మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు" అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో వివరించారు.