Pawan Kalyan: కారుపైకి ఎక్కి... పోలీసుల‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వీడియో ఇదిగో

pawan slams police

  • రాజ‌మండ్రిలోని బాలాజీపేట చేరుకున్న ప‌వ‌న్
  • జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకుంటోన్న పోలీసులు
  • పోలీసుల తీరుపై పవన్ మండిపాటు

ఏపీలోని రాజ‌మండ్రిలో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ల‌డంలో ఆ ప్రాంతంలో పోలీసులు అడుగ‌డుగున ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ శ్ర‌మ‌దానం చేయాల‌నుకున్న ప్రాంతానికి ప‌వ‌న్ చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టు నుంచి ప‌వ‌న్ వెంట వెళ్ల‌డానికి కొన్ని వాహ‌నాలకు మాత్ర‌మే అనుమ‌తులు ఇచ్చారు.  

బాలాజీపేట సెంటర్ స‌మీపంలో, హుకుంపేట-బాలాజీపేట రోడ్డు వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకుంటున్న విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కారుపైకి ఎక్కి పోలీసుల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది? అంటూ ప్రశ్నించారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేక‌లు వేశారు. అనంత‌రం బాలాజీపేట‌కు చేరుకుని శ్ర‌మ‌దానంలో పాల్గొంటున్నారు.  

  • Loading...

More Telugu News