Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌య‌న‌మ‌య్యారు: జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌

pawan to reaches ap

  • కాసేప‌ట్లో రాజ‌మండ్రి చేరుకుంటారు
  • ఆయ‌నకు స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు
  • శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు

గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో శ్ర‌మ‌దానం కార్య‌క్రమాలు నిర్వ‌హించాల‌ని సంక‌ల్పించ‌డంతో తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ పేరిట‌ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రాజ‌మండ్రిని అష్ట ‌దిగ్బంధం చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయినప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి బ‌య‌లుదేరార‌ని, కాసేప‌ట్లో రాజ‌మండ్రి విమానాశ్ర‌యం చేరుకుంటార‌ని తెలిపారు. ఆయ‌నకు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశార‌ని పేర్కొన్నారు. 

Pawan Kalyan
Janasena
Nadendla Manohar
  • Loading...

More Telugu News