Poonam Kaur: ప్రకాశ్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరు: పూనమ్ కౌర్

Poonam Kaur supports Prakash Raj in MAA Elections
  • అక్టోబరు 10న మా ఎన్నికలు
  • పోటీపడుతున్న ప్రకాశ్ రాజ్
  • ప్రకాశ్ రాజ్ కు మద్దతు పలికిన పూనమ్ కౌర్
  • ఆయన గెలవాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాజాగా మా ఎన్నికల వ్యవహారంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రకాశ్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ గెలిస్తే, ఇన్నాళ్లు తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యలన్నీ బయటపెడతానని పూనమ్ కౌర్ స్పష్టం చేశారు. ఆ సమస్యలపై తాను ఎన్నో ఏళ్లుగా మౌనంగా ఉండిపోయానని వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ తో కలిసివున్న ఓ ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు.
Poonam Kaur
Prakash Raj
MAA Elections
Tollywood

More Telugu News