Sajjala Ramakrishna Reddy: పవన్ శ్రమదానంపై స్పందించడం కూడా అనవసరం: సజ్జల

Sajjala comments on Pawan Kalyan

  • పవన్ పై సజ్జల వ్యాఖ్యలు
  • చవకబారు ప్రచారం కోరుకుంటున్నారని విమర్శలు
  • పవన్ స్థాయికి తాము దిగజారలేమని కామెంట్ 
  • బద్వేలులో జనసేన ఎవరితో కలిసినా నష్టంలేదన్న సజ్జల

బద్వేలు ఉప ఎన్నిక, రోడ్లపై పవన్ కల్యాణ్ శ్రమదానం అంశాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏవో కొన్ని గోతులు పూడ్చి, ఫొటోలు దిగడం వల్ల ఏంటి ప్రయోజనం? కెమెరా, యాక్షన్ అనగానే చేయడానికి ఇదేమైనా సినిమానా? అని ప్రశ్నించారు.

 అసలు, పవన్ కల్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించడం కూడా అనవసరం అని, ఆయన స్థాయికి తాము దిగజారలేమని పేర్కొన్నారు. చవకబారు ప్రచారం కోసం పవన్ ఇలాంటి పోరాటాలు చేయడం మానుకోవాలని సజ్జల హితవు పలికారు.

అటు, బద్వేలు ఉప ఎన్నికపై స్పందిస్తూ... జనసేన పార్టీ ఎవరితో కలిసినా తమకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.

Sajjala Ramakrishna Reddy
Pawan Kalyan
Janasena
Budvel
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News