Huzurabad: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు బీ-ఫారం అందజేత.. ఎమ్మెల్యేగా తిరిగి వస్తావంటూ కేసీఆర్ ఆశీర్వాదం

Gellu Srinivas Yadav Received B Form From KCR

  • హుజూరాబాద్ మనకు కంచుకోట
  • పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదు
  • ప్రచార ఖర్చుల కోసం రూ. 28 లక్షల చెక్కు అందజేత

హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి బీ-ఫారం అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ఆశీర్వదించారు.

హుజూరాబాద్ టీఆర్ఎస్‌కు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్నారు. అక్కడ మనదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 28 లక్షల చెక్కును ఈ సందర్భంగా శ్రీనివాస్ కు అందజేశారు.

Huzurabad
TRS
Gellu Srinivas Yadav
KCR
  • Loading...

More Telugu News