Thaman: సాయితేజ్ కోలుకుంటున్నాడు... త్వరలో వెళ్లి కలుస్తా: తమన్

Thaman tweeted on hero Saitej health condition

  • సాయితేజ్ కు ఈ నెల 10న రోడ్డు ప్రమాదం
  • కాలర్ బోన్ కు తీవ్ర గాయం
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • అభిమానుల ప్రార్థనలు ఫలించాయన్న తమన్

మెగా హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కోమాలో ఉన్నాడంటూ రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ చెప్పడం, ఆపై దర్శకుడు దేవా కట్టా రిపబ్లిక్ చిత్ర ఈవెంట్ ను సాయితేజ్ ఆసుపత్రి నుంచే వీక్షించాడని చెప్పడంతో అభిమానులు ఊరట పొందారు.

తాజాగా, సంగీత దర్శకుడు తమన్ శుభవార్త చెప్పారు. సాయితేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, మరో రెండ్రోజుల్లో స్వయంగా వెళ్లి కలుస్తానని వెల్లడించారు. "నా ప్రాణమిత్రుడు సాయిని కలవబోతుండడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది, లవ్యూ సాయి... అభిమానుల ప్రార్థనలు" ఫలించాయి అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

సాయితేజ్ ఈ నెల 10వ తేదీన హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలర్ బోన్ కు తీవ్ర గాయం కాగా, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Thaman
Sai Dharam Tej
Apollo Hospital
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News