Riddle: విప్పగలరా ఈ పజిల్?.. వైరల్ అవుతున్న ఓ యువతి విసిరిన సవాల్.. ఇదిగో వీడియో

A Math Riddle Viral In Tiktok Garnered 38 million views

  • టిక్ టాక్ లో 3.8 కోట్ల వ్యూస్
  • మూడు నిమిషాల టైమ్ ఇచ్చిన యువతి
  • మూడు రోజుల్లోనే వైరల్ అయిన టిక్ టాక్ పోస్ట్

ఇంటర్నెట్ లో ఒక పజిల్ ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. చూడ్డానికి సింపుల్ గానే అనిపించినా.. దానిని క్రాక్ చేయాలంటే మాత్రం బుర్రకు కొంచెం పదునుపెట్టక తప్పదు. టిక్ టాక్ లో వైరల్ అవుతున్న ఆ పజిల్ ను ఈ నెల 27న పోస్ట్ చేశారు. కేవలం ఈ మూడు రోజుల్లోనే ఆ పోస్ట్ ను 3.82 కోట్ల మంది చూశారు. ఇంతకీ ఏంటా పజిల్..!

కెరిన్ గెండీ అనే టిక్ టాక్ యూజర్ ఆ పజిల్ ను వేశారు. రెండు వందలను (100, 100) ఒకదాని కింద ఒకటి రాసిన ఆమె.. ఒకే ఒక్క గీతతో దానిని రెండు వందలుగా (200)గా మార్చాలంటూ తన ఫ్రెండ్స్ కు సవాల్ ను విసిరింది. వారికి ఓ మూడు నిమిషాల టైమ్ ఇచ్చింది. అయితే, కాసేపు గందరగోళంతో చూశారు. 188 అని రాసి మధ్యలో గీత గీశారు. కానీ, అది తప్పు అని ఆమె తేల్చింది.

రెండు వందల్లో పై వందలోని ఒకటిమీద ఒక గీత గీస్తే సరి అని ఆమె పేర్కొంది. అయితే, అది ‘TOO 100’ అవుతుంది కానీ, 200 ఎలా అవుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఒక చిన్న పజిల్ తో ఆమె ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News