Pawan Kalyan: గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: పవన్ కల్యాణ్

I will show what development is says Pawan Kalyan

  • జనసేన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్
  • గత ఎన్నికల్లో జరిగిన తప్పులకు పశ్చాత్తాపపడుతున్నానన్న జనసేనాని
  • వర్గపోరుతో అభివృద్ధిని వదిలేయొద్దని సలహా

తాను సమస్యల నుంచి పారిపోయే వ్యక్తిని కానని, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాష్టీక పాలనను గమనిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు వైసీపీకి ఇచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ దుర్వినియోగం చేస్తోందని పవన్ అన్నారు. సంక్షేమం పేరులో ప్రజలను మభ్యపెడుతున్నారని, రాయలసీమలో దళితుల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రమంటే రెండు కులాల మధ్య వర్గపోరు కాదని, దాంతో అభివృద్ధిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కులాల గొడవ కోసం రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేయొద్దని చెప్పారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటానని, జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నానని వవన్ అన్నారు. ‘‘ఒక్కసారి నన్ను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. శాంతిభద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తా. ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తా’’ అని హామీ ఇచ్చారు.

'నా కులానికి చెందిన వారితోనే నన్ను తిట్టిస్తున్నారు. అలా ఎందుకు? అన్ని కులాల వాళ్లతో తిట్టించండి' అన్నారు పవన్. తాను కులానికి ఎప్పుడూ దూరం కాలేదని, అదే సమయంలో ఇతర కులాల పట్ల కూడా గౌరవం చూపిస్తానని చెప్పారు. వైసీపీ నేతలు తనను కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అంటూ విమర్శిస్తున్నారని, ఇతర పార్టీ నేతలను లాక్కోవడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు తమ పార్టీ వ్యూహాలు కూడా మారతాయని వివరించారు.

  • Loading...

More Telugu News