Sumedha: కోర్టుకెళ్లిన సుమేధ తల్లి.. కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతివాదులుగా పిటిషన్

Sumedha Mother Files Petition Against Police and KTR

  • పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
  • నేరేడ్ మెట్ పోలీసుల రిపోర్ట్ ను ఆమోదించొద్దని వినతి
  • మళ్లీ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి
  • గత ఏడాది నాలాలో పడి చనిపోయిన చిన్నారి

గత ఏడాది సెప్టెంబర్ లో సుమేధ అనే చిన్నారి నాలాలో పడి చనిపోయిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. హైదరాబాద్ మల్కాజిగిరిలో సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన సుమేధ.. ఓపెన్ నాలాలో పడి కొట్టుకుపోయింది. తెల్లారి సమీపంలోని చెరువులో శవమై తేలింది. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.

తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని సుమేధ తల్లిదండ్రులు నాడు ఆరోపణలు చేశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కేసు కూడా పెట్టారు. తాజాగా మరోసారి చిన్నారి తల్లిదండ్రులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. సుమేధ కేసును మరోసారి దర్యాప్తు చేయించాలని కోరుతూ చిన్నారి తల్లి మల్కాజ్ గిరి కోర్టులో పిటిషన్ వేశారు.


నాడు ఫిర్యాదు చేస్తే కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్ లో ఆమె ఆరోపించారు. నేరేడ్ మెట్ పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన కోర్టు అక్టోబర్ 20న సాక్షుల వాంగ్మూలం తీసుకుంటామని తెలిపింది.

  • Loading...

More Telugu News