Nara Lokesh: ఎన్టీఆర్ విగ్రహం మిమ్మల్ని ఏం చేసిందని ఎత్తుకుపోయారు?: నారా లోకేశ్

Nara Lokesh questions on NTR statue went missing
  • రాజమండ్రిలో ఎన్టీఆర్ విగ్రహం మాయం
  • అరాచక పాలనలో మరో ఘటన జరిగిందన్న లోకేశ్
  • ఎవరెత్తుకెళ్లారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యలు
  • అదేస్థానంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించాలని డిమాండ్
రాజమండ్రిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎత్తుకుపోయిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. రామతీర్థంలో హిందువుల ఆరాధ్య దైవం రాముడి విగ్రహం తల ఎత్తుకుపోయిన అరాచక పాలనలో మరో ఘటన జరిగిందంటూ విమర్శించారు. రాజమండ్రిలో నందమూరి తారక రామారావు విగ్రహం ఎత్తుకెళ్లింది ఎవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

రాజమండ్రి 31వ వార్డులో ఇటీవలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారని లోకేశ్ వెల్లడించారు. ఆ విగ్రహం మిమ్మల్ని ఏంచేసిందని ఎత్తుకెళ్లారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దొంగలను పట్టుకుని శిక్షించాలని, అదేస్థానంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
NTR Statue
Rajamundry
TDP

More Telugu News