Pawan Kalyan: తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు: పవన్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్

AP Minister Perni Nani Reacts to Pawan Kalyan Tweet
  • పవన్-నాని మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
  • జనం ఛీత్కారాలు.. అంటూ నాని ట్వీట్
  • పవన్‌పై ట్రోలింగ్ వీడియో షేర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలపై మొన్న మంత్రి పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో పవన్‌పై విమర్శలు చేశారు.

 నాని వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్.. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ నంటూ గత రాత్రి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై తాజాగా స్పందించిన మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో మళ్లీ విరుచుకుపడ్డారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేస్తూ పవన్‌పై ఓ ట్రోలింగ్ వీడియోను షేర్ చేశారు.
Pawan Kalyan
Perni Nani
Janasena
YSRCP
Twitter

More Telugu News