Youtube: యూట్యూబ్‌లో చూస్తూ గర్భస్రావానికి యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న మహిళ

Rape victim in Nagpur hospitalised after trying to abort foetus watching YouTube videos

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • పెళ్లి పేరుతో 2016 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడు
  • గర్భం దాల్చడంతో యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకోవాలని సూచన
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

విజ్ఞానం నుంచి వినోదం వరకు, చిట్కాల నుంచి వైద్యం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉండని వీడియోలంటూ ఉండవు. అయితే వీటికి విశ్వసనీయత అంతంత మాత్రమే. వాటిని అనుసరించామా మన పని అయిపోయినట్టే. అందులో చూపించే ప్రతీదీ నిజమని నమ్మితే ఈ మహిళలానే ప్రాణాల మీదికి వస్తుంది.

అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ గర్భస్రావం చేసుకోవాలని నిర్ణయించింది. అయితే, ఆసుపత్రికి వెళ్లడం మాని యూట్యూబ్‌లో గర్భస్రావానికి సంబంధించిన వీడియోలు చూస్తూ, అలాగే చేసింది. ఫలితంగా ఆమె ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ షోయబ్ ఖాన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2016 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని వాపోయింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి గర్భస్రావం చేసుకోవాలని షోయబ్ సూచించాడు. ఆమె అలాగే చేయడంతో వికటించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో షోయబ్‌ఖాన్‌పై అత్యాచారం సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News