Varla Ramaiah: పవన్ గారూ... వారి అసభ్య పదజాలాన్ని జంతువుల ఘీంకారాలతో పోల్చి చావుదెబ్బ కొట్టారు: వర్ల రామయ్య

Varla Ramaiah appreciates Pawan Kalyan
  • జంతువుల ఘీంకారాలతో పవన్ తాజా ట్వీట్
  • స్పందించిన వర్ల రామయ్య
  • పరిణతి చెందారంటూ పవన్ కు కితాబు
  • రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన తాజా ట్వీట్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. 'పవన్ కల్యాణ్ గారూ... మీరు రాజకీయంగా బాగా పరిణతి చెందారు' అంటూ ప్రశంసించారు. ప్రత్యర్థుల బూతు పురాణాలకు స్పందించకుండా, వారి అసభ్య పదజాలాన్ని జంతువుల ఘీంకారాలతో పోల్చి చావుదెబ్బ కొట్టారు అంటూ కొనియాడారు. మరి ఈ బూతు ప్రవచనా శ్రేష్టులకు మీ కవి హృదయం అర్థమవుతుందా నటశ్రేష్టా? అని సందేహం వ్యక్తం చేశారు.. మన రాష్ట్రాన్ని ప్రస్తుతం ఆ దేవుడే కాపాడాలి అంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు.
Varla Ramaiah
Pawan Kalyan
Tweet
Janasena
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News