Prakash Raj: దేశం కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్: ప్రకాశ్ రాజ్

Pawan Kalyan is a great leader says Prakash Raj

  • 'మా' ఎన్నికలు సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాం
  • పరస్పర నిందారోపణలు వద్దు
  • పవన్ కు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రకాశ్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ కు సంబంధించిన అందరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి విషయంలో ఇతరుల కంటే తాము ఒక అడుగు ముందున్నామని చెప్పారు. ఇవి ఎన్నికలు కాదని, కేవలం పోటీ మాత్రమేనని అన్నారు. ఎన్నికలు సవ్యంగా జరగాలని కోరుకుంటున్నామని... పరస్పర నిందారోపణలు వద్దని కోరారు.

ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ప్రశంసలు కురిపించారు. పవన్ ఒక గొప్ప నాయకుడని, దేశం కోసం పోరాడుతున్నారని కితాబునిచ్చారు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పారు. పవన్ కూడా 'మా' సభ్యుడేనని తెలిపారు. ఎవరు ఏది మాట్లాడినా ఇండస్ట్రీ మంచి కోసమేనని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉంటుందని, ప్రేమ ఉంటుందని, వాళ్లని మాట్లాడనివ్వాలని చెప్పారు. అసోసియేషన్ అభ్యుదయం కోసం పని చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

Prakash Raj
Pawan Kalyan
Tollywood
MAA Elections
  • Loading...

More Telugu News