Priests: ఏపీలో అర్చకులకు శుభవార్త... 25 శాతం వేతనం పెంపు!
- దేవాదాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష
- అర్చకుల సమస్యలపై చర్చ
- వంశపారంపర్యంగా అర్చకుల నియామకానికి ఆమోదం
- వివరాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమగ్ర రీతిలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అర్చకుల సమస్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు.
ఏపీ సర్కారు గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచిన సంగతి తెలిసిందే. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.