Chandrababu: ఎస్పీబీ శివైక్యం చెంది ఏడాది అయిందంటే నమ్మశక్యంగా లేదు: చంద్రబాబు

Chandrababu pays tributes to SP Balu

  • గత ఏడాది సెప్టెంబర్ 25న కన్నుమూసిన బాలు
  • బాలు మధుర గాత్రం పాట రూపంలో వినిపిస్తూనే ఉందన్న చంద్రబాబు
  • గానగంధర్వుడికి నివాళి అర్పిస్తున్నామని ట్వీట్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించి అప్పుడే ఏడాది గడిచిపోయింది. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూశారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా ఈ రోజు అందరూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనను స్మరించుకుంటూ, నివాళి అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. మైమరపించే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉందని చంద్రబాబు అన్నారు. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయిందంటే నమ్మాలని అనిపించడం లేదని చెప్పారు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా... ఆ గానగంధర్వుని స్మృతికి నివాళి అర్పిస్తున్నామని అన్నారు.

Chandrababu
Telugudesam
SP Balasubrahmanyam
  • Loading...

More Telugu News