USA: భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా.. భారత్ కు ఇవ్వాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్

Biden Stressed India As Permanent Member In UNSC
  • మోదీతో భేటీ అనంతరం వ్యాఖ్యలు
  • గత నెలలో అధ్యక్ష హోదాలో బాగా పనిచేసిందని ప్రశంస
  • ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ సమయంలోనూ మెరుగైన పనితీరు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్ కు శాశ్వత సభ్యత్వం ప్రాధాన్యంపై మరోసారి చర్చకు వచ్చింది. భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు.

ఆగస్టులో యూఎన్ఎస్సీ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ సమర్థంగా పనిచేసిందని బైడెన్ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న సమయంలో చాలా బాగా పనిచేసిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి ఎప్పటి నుంచో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, వీటో పవర్ ను వాడుకుంటూ చైనా ఆయా దేశాల డిమాండ్ ను కొట్టిపారేస్తోంది. దీంతో భారత్ కొన్నేళ్లుగా తాత్కాలిక సభ్యదేశంగానే కొనసాగుతోంది.
USA
India
UNSC
Security Council
UN
United Nations
Joe Biden
Prime Minister
Narendra Modi

More Telugu News