Civil Services-2020: సివిల్ సర్వీసెస్ ఫలితాల వెల్లడి... 100 లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు

UPSC Civil Services results released

  • సివిల్ సర్వీసెస్-2020 ఫలితాల వెల్లడి 
  • శుభం కుమార్ కు ఫస్ట్ ర్యాంకు
  • జాగృతి అవస్థి, అంకితా జైన్ లకు రెండు, మూడు ర్యాంకులు
  • తెలుగమ్మాయి శ్రీజకు 20వ ర్యాంకు

ఐఏఎస్, ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి. సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు. తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం. పి. శ్రీజకు 20వ ర్యాంకు లభించగా, 27వ ర్యాంకులో మైత్రేయి నాయుడు, 84వ ర్యాంకులో రవికుమార్, 93వ ర్యాంకులో యశ్వంత్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ఈసారి సివిల్ సర్వీసెస్ లో ఫస్ట్ ర్యాంకు శుభం కుమార్ కు లభించింది. జాగృతి అవస్థి, అంకితా జైన్ వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు. సివిల్ సర్వీసెస్-2020 ద్వారా 761 మందిని ఎంపిక చేసినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది.

100కి పైన ర్యాంకులు పొందిన వారిలో మరో ఆరుగురు తెలుగు అభ్యర్థులు ఉన్నారు. కె.సౌమిత్ రాజు (355), తిరుపతిరావు (441), సూరపాటి ప్రశాంత్ (498), దోనెపూడి విజయ్ బాబు (682), ఈదుగాల వేగిని (686), కళ్లం శ్రీకాంత్ రెడ్డి (747) ర్యాంకులు సాధించారు.

  • Loading...

More Telugu News