Jeevan Reddy: మంచి ఉంటే చెప్పండి... పార్టీకి నష్టం కలిగించే మాటలు ఇక్కడొద్దు: జేసీపై జీవన్ రెడ్డి అసహనం

Jeevan Reddy warns JC Diwakar Reddy

  • తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ
  • కాంగ్రెస్ పాత మిత్రులతో మాటామంతీ
  • అసహనానికి లోనైన జీవన్ రెడ్డి
  • మరోసారి ఇలా మాట్లాడొద్దని హితవు

ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ వర్గీయుడన్న సంగతి తెలిసిందే. నాడు ఉమ్మడి రాష్ట్రంలో తన కాంగ్రెస్ సహచరులుగా ఉన్న నేతలను ఆయన ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లి పలకరిస్తుంటారు. సీఎల్పీకి వెళ్లడం, పనిలోపనిగా రెండు మూడు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జేసీకి పరిపాటిగా మారింది. అయితే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు వెళ్లిన జేసీకి ఊహించని పరిణామం ఎదురైంది. మీ సలహాలు మాకు అక్కర్లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దాంతో జేసీ దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఏదైనా ఉపయోగపడే అంశాలు ఉంటే చెప్పండి, అంతేతప్ప పార్టీకి నష్టం కలుగజేసే మాటలు ఇక్కడ మాట్లాడొద్దు అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీకి వచ్చి పార్టీని ఇబ్బందిపెట్టొద్దు అంటూ రెండు చేతులు జోడించారు. దాంతో, వాస్తవ పరిస్థితిని గ్రహించిన జేసీ దివాకర్ రెడ్డి వెంటనే స్పందించారు. క్షమించండి... ఇకపై ఇలాంటి విషయాలు మాట్లాడను... తప్పయిపోయింది అంటూ బదులిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News