Pakistan: న్యూజిలాండ్ పర్యటన రద్దుకు కారణం ఈ భారత సింగరేనంటున్న పాక్ మంత్రి!

Netizens Trending Rapper Om Prakash Mishra After Pak Minister Statement

  • ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి బెదిరించాడన్న పాక్ మంత్రి
  • వెంటనే ర్యాపర్ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండింగ్
  • పాక్ ను ఓ ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

పాకిస్థాన్ పర్యటన నుంచి న్యూజిలాండ్ అర్థాంతరంగా తప్పుకొంది. బాంబు బెదిరింపు రావడం, ఆటగాళ్ల భద్రతపై నీలినీడలు కమ్ముకోవడంతో టూర్ ను మధ్యలోనే రద్దు చేసుకుంది ఆ జట్టు. ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ కూడా అదే బాటలో పాక్ కు రాబోమని ప్రకటించింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆ బెదిరింపులు భారత్ నుంచే వచ్చాయంటూ పాక్ విదేశాంగ మంత్రి ఫవాద్ చౌదరి ఆరోపణలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి అర్థం లేని మాటలన్నీ మాట్లాడారు.

మాటల్లో మాటగా ముంబైకి చెందిన ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి బెదిరింపు మెయిల్ పంపాడంటూ చెప్పారు. ఆ తర్వాత ఆయన మాటలను భారత్ ఖండించడం, పాక్ మంత్రిపై మన నెటిజన్లు విమర్శలు చేయడం అన్నీ జరిగిపోయాయి. అయితే, కథ అక్కడితో అయిపోలేదు. మంత్రిగారు చెప్పిన ఓం ప్రకాశ్ అనే వ్యక్తి ఇప్పుడు నెట్టింట్లో భలే ట్రెండ్ అయిపోతున్నాడు.

ర్యాపర్, సింగర్ ఓం ప్రకాశ్ మిశ్రాను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. ‘బోల్ నా ఆంటీ ఓ క్యా’ అంటూ నెట్ లో సంచలనం సృష్టించిన ఓం ప్రకాశ్ మిశ్రాను గుర్తు తెచ్చుకుని హాష్ ట్యాగ్ లతో వైరల్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

మిశ్రా ‘రా (భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)’ ఆఫీస్ లో ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దాదర్ స్టేషన్ నుంచి న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్న ఓం ప్రకాశ్ మిశ్రా అంటూ కరెంట్ స్తంభం ఎక్కిన బాలీవుడ్ కమెడియన్ ఫొటోను షేర్ చేశారు మరో యూజర్. బాహుబలి, కట్టప్పతో పోలుస్తూ మరో పోస్టర్ ను ఇంకొకరు పోస్ట్ చేశారు. ఎఫ్ బీఐలో జాబ్ ఉంది కావాలా? అంటూ ఇంకొకరు పోస్ట్ పెట్టారు. మొత్తానికి పాక్ మంత్రి నోటి పుణ్యాన ఈ ర్యాపర్ నెట్టింట్లో ఓవర్ నైట్ హీరోగా మారిపోయాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News