Sensex: స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుత ఘట్టం.. 60 వేల మార్క్ ను అధిగమించిన సెన్సెక్స్!

Sensex crosses 60 K mark for the first time

  • ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 60 వేల మార్కును  అధిగమించిన సెన్సెక్స్
  • 18 వేల పాయింట్లను టచ్ చేసే దిశగా దూసుకుపోతున్న నిప్టీ
  • ప్రస్తుతం 60,292 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్

భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమయింది. ఈరోజు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 60 వేల పాయింట్ల మైలు రాయిని దాటింది. దీంతో మన మార్కెట్ల హిస్టరీలో ఈరోజు ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 18 వేల మార్కును టచ్ చేసే దిశగా దూసుకుపోతోంది.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం జోష్ లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం మన మార్కెట్లలో ర్యాలీ కొనసాగడానికి కారణమవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 60,292 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 17,925 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఏసియన్ పెయింట్స్, భారతి ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి.

  • Loading...

More Telugu News