Bollywood: శృంగార చిత్రాలకు అనుమతులు అక్కర్లేదు: పోలీసుల విచారణలో నటి గెహనా వశిష్ట్
- నాలుగు గోడల మధ్య షూట్ చేస్తే అవసరం లేదన్న నటి
- దేశంలో డిజిటల్ కంటెంట్ పై సెన్సార్ షిప్ చట్టం లేదని కామెంట్
- తనను కేసులో ఇరికించారని ఆవేదన
శృంగార చిత్రాలకు అసలు అనుమతులే అవసరం లేదని నటి, దర్శకురాలు గెహనా వశిష్ట్ తెలిపింది. తనపై నమోదైన ఓ కేసు విచారణకు సంబంధించి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు ఆమె హాజరై, తన చర్యలను సమర్థించుకుంది. నాలుగు గోడల మధ్య రహస్యంగా తీసే శృంగార చిత్రాలకు అనుమతులు ఎందుకని ప్రశ్నించింది.
డిజిటల్ కంటెంట్ సెన్సార్ కు సంబంధించినంత వరకు దేశంలో ఇంకా ఎలాంటి చట్టాలు లేవని, కాబట్టి శృంగార చిత్రాలను నిర్మించే స్వేచ్ఛ తమకుందని, అది చట్టవిరుద్ధం కాదని తెలిపింది. కేసులో తనను అనవసరంగా ఇరికించారని, ఐదు నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
రాజ్ కుంద్రా వ్యవహారంపై తాను ఏమీ మాట్లాడబోనని, కానీ, తాము తీసింది మాత్రం పోర్న్ కాదని స్పష్టం చేసింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా అమ్మాయిలను ఉసిగొల్పుతున్నారని, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. పోలీస్ దర్యాప్తుకు అన్ని విధాలుగా తాను సహకరిస్తానని ఆమె చెప్పింది.