Mahesh Babu: 'దూకుడు' కథ అలా పుట్టింది: శ్రీను వైట్ల

Srinu Vaitla discussed about Dookudu movie story
  • మహేశ్ తో దేశభక్తి సినిమా చేయాలనుకున్నాను
  • ఆ కథపై కసరత్తు నడిచింది
  • కొన్ని కారణాల వలన అది ఆగిపోయింది
  • ఎమ్మెల్యే పాత్ర చుట్టూ అల్లిన కథ ఇది
మహేశ్ బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2011లో సెప్టెంబర్ 23వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

ఈ రోజుతో ఈ సినిమా పదేళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ .. "ముందుగా నేను మహేశ్ బాబుతో ఒక దేశభక్తి సినిమాను చేయాలనుకున్నాను. కొంతకాలం పాటు ఆ కథపై కసరత్తు నడిచాక, కొన్ని సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేయవలసి వచ్చింది.

ఆ తరువాత మాటల సందర్భంలో మహేశ్ ను ఎమ్మెల్యే గా చూపిస్తే ఎలా ఉంటుందనే ప్రస్తావన వచ్చింది. అప్పుడు అల్లుకున్న కథనే 'దూకుడు'. ప్రకాశ్ రాజ్ పాత్రకి గాను ముందుగా శ్రీహరిని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. మహేశ్ కెరియర్లో చెప్పుకోదగిన హిట్ ఇచ్చినందుకు నాకు గర్వంగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Mahesh Babu
Samantha
Prakash Raj
Srinu Vaitla

More Telugu News