Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samanta compliments Nagarjunas look

  • మామకు సమంత కాంప్లిమెంట్స్ 
  • ఊటీకి పయనమవుతున్న 'గాడ్ ఫాదర్'
  • చైతూతో శేఖర్ కమ్ముల మరో ప్రాజక్ట్  

*  నిన్న అక్కినేని నాగార్జున తన 'బంగార్రాజు' లుక్ ను విడుదల చేస్తూ, తన తండ్రిని గుర్తుచేసుకున్న సంగతి విదితమే. తండ్రిలా పొందూరు ఖద్దరు పంచెకట్టుకుని, తన తండ్రి వాడిన నవరత్నాల హారాన్ని ధరించి.. 'ఇప్పుడు నాన్న నాతోనే ఉన్నట్టుంది' అంటూ నాగ్ ఓ వీడియోలో అనుభూతి చెందారు. దీనికి ఎంతోమంది నుంచి పాజిటివ్  రెస్పాన్స్ వచ్చింది.  అలాగే ఆయన కోడలు, కథానాయిక సమంత కూడా స్పందిస్తూ..'ఇది సో బ్యూటిఫుల్ మామా' అంటూ నాగ్ లుక్ ను ప్రశంసించింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును ఊటీలో నిర్వహిస్తారు. అక్కడ గ్రామీణ వాతావరణంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందుకోసం యూనిట్ ఇప్పుడు ఊటీకి పయనమవుతోంది. మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి ఇది రీమేక్ గా రూపొందుతోంది.
*  నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' చిత్రం ఈ నెల 24న రిలీజవుతోంది. కాగా, చైతూ హీరోగా శేఖర్ కమ్ముల మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో తాను ధనుష్ తో చేయనున్న చిత్రం తర్వాత చైతూ హీరోగా రూపొందే చిత్రం ఉంటుందని శేఖర్ తాజాగా వెల్లడించారు.

Samantha
Nagarjuna
Chiranjeevi
shekhar Kammula
  • Loading...

More Telugu News